Monday, 23 March 2026
SWASTHIK NEWS
Home / భక్తి వార్తలు

ఈ రోజే "ఉగాది".. విషవిశేలు తెలుసుకోండి!

16 Mar 2026
01:46 PM
998

స్వస్తిక్ న్యూస్, భక్తి :- తెలుగు ప్రజలు అత్యంత ఆనందంగా జరుపుకునే పండుగలలో ఒకటైన "ఉగాది"  మార్చి 19న అనగా ఈ రోజు జరగనుంది. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున వచ్చే ఈ పండుగతో తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుందని విశ్వాసం. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఉగాది రోజు ఉదయం నుంచే ఇళ్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి పండుగ వాతావరణాన్ని సృష్టిస్తారు. ఉగాది సందర్భంగా ప్రజలు తెల్లవారుజామున లేచి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేసి, మామిడి ఆకులతో తొరణాలు కడతారు. కుటుంబ సభ్యులు కలిసి పండుగను ఆనందంగా జరుపుకుంటారు. ఈ రోజు పెద్దలు చిన్నవారికి ఆశీర్వాదాలు ఇవ్వడం కూడా సంప్రదాయంగా కొనసాగుతోంది.

Article Image

ఈ పండుగలో ముఖ్యమైన ప్రత్యేకత  ఉగాది పచ్చడి. వేపపువ్వు, బెల్లం, చింతపండు, మామిడి ముక్కలు, మిర్చి, ఉప్పు వంటి పదార్థాలతో తయారయ్యే ఈ పచ్చడికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఆరు రుచులు కలిసిన ఈ పచ్చడి జీవితంలో సంతోషం, బాధ, కోపం, ఆశ్చర్యం వంటి అనుభవాలన్నింటినీ సమానంగా స్వీకరించాలనే సందేశాన్ని ఇస్తుందని భావిస్తారు.అలాగే ఉగాది రోజున పండితులు "పంచాంగ శ్రవణం" నిర్వహించి కొత్త సంవత్సరానికి సంబంధించిన ఫలితాలను ప్రజలకు వివరిస్తారు. వ్యవసాయం, వర్షపాతం, ఆర్థిక పరిస్థితులు వంటి విషయాలపై పంచాంగంలో చెప్పే వివరాలను వినడం అనేది సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తెలుగు ప్రజలు కొత్త ఆశలు, లక్ష్యాలతో ఉగాది పండుగను స్వాగతించేందుకు సిద్ధమవుతున్నారు. 

 

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!

Related Articles

Recent Updates