స్వస్తిక్ న్యూస్, ఫాక్ట్స్ :- సాధారణంగా ఉదయం నిద్రలేవగానే ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదని, ఇది శరీరాన్ని శుద్ధి చేస్తుందని మనందరికీ తెలుసు. అయితే, అందరికీ ఇది వర్తించదని, కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఉదయాన్నే నీళ్లు తాగే విషయంలో ఆచితూచి వ్యవహరించాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇటీవలి నివేదికల ప్రకారం, కింది సమస్యలు ఉన్నవారు నీటి వినియోగంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.కిడ్నీ మరియు గుండె సంబంధిత సమస్యల.కిడ్నీ వ్యాధులు లేదా గుండె జబ్బులతో బాధపడేవారు అధికంగా నీటిని తీసుకుంటే, ఆ ప్రభావం నేరుగా ఆయా అవయవాలపై పడుతుంది. నీటి శాతం పెరగడం వల్ల కిడ్నీలపై వడపోత భారం, అలాగే గుండెపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది.గ్యస్ట్రిక్ మరియు యాసిడ్ రిఫ్లక్స్.తీవ్రమైన గ్యాస్ట్రిక్ లేదా యాసిడ్ రిఫ్లక్స్ సమస్యలు ఉన్నవారు ఉదయాన్నే నీళ్లు తాగడం వల్ల కడుపులో అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉంది. ఇది జీర్ణక్రియలో కొన్ని ఇబ్బందులను కలిగించవచ్చు.శరీర వాపులు (Edema)శరీరంలో నీరు చేరి వాపులు వచ్చే సమస్య (Water retention) ఉన్నవారు కూడా నీటిని పరిమితంగా తీసుకోవాలి. వైద్యుల సలహా లేకుండా అధికంగా నీళ్లు తాగడం వల్ల ఈ సమస్య మరింత జటిలం కావచ్చు.
ముఖ్య గమనిక:- ఆరోగ్యవంతులకు ఉదయాన్నే నీళ్లు తాగడం మేలు చేసినప్పటికీ, పైన పేర్కొన్న సమస్యలు ఉన్నవారు మాత్రం తమ డాక్టర్ సూచించిన మేరకు మాత్రమే నీటిని తీసుకోవడం శ్రేయస్కరం.