స్వస్తిక్ న్యూస్, తిరుమల:- కలియుగ వైకుంఠమైన తిరుమలలోని ప్రధాన ప్రాంతాలకు, మార్గాలకు ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా సరికొత్త పేర్లను ఖరారు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) భావిస్తోంది. భక్తులలో ఆధ్యాత్మిక భావనను మరింత పెంపొందించే ఉద్దేశంతో ఈ మార్పులు చేయనున్నారు.నాలుగు వీధులు - నాలుగు వేదాలు.శ్రీవారి ఆలయం చుట్టూ ఉన్న నాలుగు ప్రధాన మాడ వీధులకు మన చతుర్వేదాల పేర్లను పెట్టాలని టీటీడీ నిర్ణయించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఋగ్వేద మార్గం
యజుర్వేద మార్గం
సామవేద మార్గం
అథర్వణవేద మార్గం
ప్రధాన మార్గాలకు ప్రముఖుల పేర్లు
మాడ వీధులతో పాటు ఇతర ముఖ్యమైన రహదారులకు కూడా పౌరాణిక మరియు చారిత్రక ప్రాధాన్యత ఉన్న పేర్లను పరిశీలిస్తున్నారు.శ్రీకృష్ణదేవరాయ మార్గo శ్రీవారి దర్శనం అనంతరం భక్తులు బయటకు వచ్చే రోడ్డు ప్రాంతానికి విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల పేరును పెట్టనున్నారు.ఇతర పరిశీలనలో ఉన్న పేర్లు గరుడాద్రి, పద్మావతి, మరియు ఆళ్వార్ల పేర్లను ఇతర మార్గాలకు పెట్టే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు.ఈ నిర్ణయం ద్వారా తిరుమల పవిత్రతను, భారతీయ సంస్కృతిని భవిష్యత్తు తరాలకు చాటిచెప్పవచ్చని టీటీడీ వర్గాలు భావిస్తున్నాయి.