స్వస్తిక్ న్యూస్:- తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాల విడుదల వేళ తీవ్ర విషాదం నెలకొంది. పరీక్షల్లో ఆశించిన ఫలితాలు రాలేదన్న మనస్తాపంతో రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఎనిమిది మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు.
ఘటన వివరాలు:- పరీక్షల్లో ఫెయిల్ అయ్యామన్న కారణంతో కొందరు, మార్కులు తక్కువ వచ్చాయని మరికొందరు తీవ్ర ఒత్తిడికి లోనై తనువు చాలించారు. పరీక్షల్లో విఫలమవడం అంటే జీవితంలో ఓడిపోవడం కాదనే కనీస విషయాన్ని కూడా ఆలోచించకుండా, క్షణికావేశంలో తీసుకున్న ఈ నిర్ణయాలు ఆయా కుటుంబాల్లో తీరని కడుపుకోతను మిగిల్చాయి.కేవలం మార్కులు మాత్రమే భవిష్యత్తును నిర్ణయించవని పిల్లలకు అర్థమయ్యేలా వివరించాల్సిన అవసరం నేడు ఎంతైనా ఉంది.ఒత్తిడిని గుర్తించండి: విద్యార్థులు మానసిక ఆందోళనలో ఉన్నప్పుడు వారిని ఓదార్చి, వెన్నుతట్టి ధైర్యం చెప్పాలి. ప్రభుత్వంతో పాటు పాఠశాలలు, కళాశాలలు కూడా ఈ విషయంలో విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉంది.
ముఖ్య గమనిక:- ఏ సమస్యకైనా ప్రాణం తీసుకోవడం పరిష్కారం కాదు. మానసిక ఒత్తిడి లేదా ఆందోళన కలిగినప్పుడు ప్రభుత్వం కేటాయించిన హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించి నిపుణుల సలహాలు తీసుకోవచ్చు.