Wednesday, 25 March 2026
SWASTHIK NEWS
Home / ఆంధ్రప్రదేశ్

ధరలు లేక దారుణంగా మారిపోయిన టమోటా రైతన్నల పరిస్థితి

24 Mar 2026
11:53 AM
204

స్వస్తిక్ న్యూస్,ఆంధ్రప్రదేశ్ :-  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టమోటా రైతుల పరిస్థితి చాలా దయనీయంగా మారింది. గత కొద్ది రోజుల నుంచి టమాటాకు సరైన గిట్టుబాటు ధరలు లేక అవి పండించిన రైతన్నలు తలలు పట్టుకుంటున్నారు. తాజాగా నంద్యాల జిల్లా ప్యాపిలి మార్కెట్లో కేజీ టమాటా రూపాయి నుంచి 3 రూపాయలు మాత్రమే పలకడంతో ఆ రైతు ఆశ్చర్యపోయాడు. 105 టమోటా బాక్సులను వ్యాపారి దగ్గరికి తీసుకువెళ్తే ఆ వ్యాపారి ఒక్కో బాక్స్ కు 35 రూపాయలు చొప్పున లెక్క గట్టి కమిషన్లు అన్నీ పోగా 2000 రూపాయలు రైతు చేతిలో పెట్టారు. రవాణా ఖర్చులే 2000 రూపాయలకు పైగా ఉండడంతో.. పెట్టిన పెట్టుబడి కి కూడా డబ్బులు రాకపోవడంతో ఆ రైతు మార్కెట్లోనే ఏడుస్తూ కుప్పకూలిపోయాడు. మరోవైపు చిత్తూరు జిల్లా పలమనేరు మార్కెట్లో కూడా కేజీ టమాటా 3 నుంచి 6 రూపాయలు, మదనపల్లి మార్కెట్లో 7 రూపాయలు, అనంతపురం జిల్లా ఉరవకొండలో 2 నుంచి 3 రూపాయలు, కక్కలపల్లి లో 3 నుంచి 7 రూపాయలు పలకడంతో రాష్ట్రవ్యాప్తంగా టమాటాలు పండించినటువంటి రైతన్నలకు దిక్కుతోచనీ పరిస్థితులు ఏర్పడ్డాయి. అందులోని కొంతమంది రైతన్నలకు ఏకంగా ఆత్మహత్యలు చేసుకునే విధంగా పరిస్థితులు ఏర్పడ్డాయి. వెంటనే ప్రభుత్వాలు స్పందించి కూరగాయలకు సరైన గిట్టుబాటు ధర కల్పించాలి అని వేడుకుంటున్నారు.  వెంటనే ఈ విషయంపై ప్రభుత్వం స్పందించి సరైన గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరుతున్నాం. రైతే దేశానికి వెన్నుముక అంటారు కానీ.. రైతన్నలకు ఆపద వస్తే ఏ అధికారి ముందుకు రావడం లేదు.

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!

Related Articles

Recent Updates