స్వస్తిక్ న్యూస్, స్పోర్ట్స్ :- ప్రతి సంవత్సరం వేసవి కాలంలో దాదాపు రెండు నెలల పాటు ప్రపంచవ్యాప్తంగా యువత ఐపీఎల్ ద్వారా ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈసారి ఐపీఎల్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. కేవలం పదే పది రోజులలో ఐపీఎల్ ప్రారంభం అవుతుండడంతో ఇప్పటి నుంచే పలు జట్లపై క్రికెట్ అభిమానులు మరియు విశ్లేషకులు ఏ జుట్టు సెమీస్ కు అలాగే ఫైనల్స్ కు చేరే అవకాశాలు ఉన్నాయో అనే లెక్కలు వేసుకుంటున్నారు. దాదాపు రెండు నెలల పాటు ఈ ఐపీఎల్ 19 సీజన్ క్రికెట్ అభిమానులకు వినోదాన్ని పంచునుంది.

గత 18 సంవత్సరాలుగా ఐపిఎల్ కు ఎంత ఆదరణ దక్కింది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ ఎంతో ప్రాముఖ్యత చెందింది. గత సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చుట్టూ ట్రోఫీని ముద్దాడింది. ఇక ఈ సంవత్సరం కూడా మొదటి మ్యాచ్లో RCB మరియు SRH హోరాహోరీగా తలపడునున్నాయి. ఐపీఎల్ జరుగుతున్న సమయంలో బెట్టింగుకు కూడా పాల్పడే అవకాశాలు ఉండడంతో పోలీసులు పలుచోట్ల తనిఖీలు నిర్వహిస్తూ బెట్టింగుకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాము అని ఇప్పటినుంచే హెచ్చరిస్తున్నారు.