స్వస్తిక్ న్యూస్, సినిమా :- రామ్ చరణ్ ప్రస్తుతం ‘పెద్ది’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో యంగ్ ప్లేయర్ తిలక్ వర్మ సెట్స్‌ను సందర్శించారు. చరణ్‌ను కలిసిన తిలక్‌కు టీమ్ సభ్యులు సాదరంగా స్వాగతం పలికారు. చిత్ర యూనిట్‌తో తిలక్ సరదాగా గడిపినట్లు సమాచారం.ఈ సందర్శనలో భాగంగా చరణ్, తిలక్‌కు ప్రత్యేకంగా బ్యాట్‌ను బహుమతిగా ఇచ్చారు. ‘నాకు టైమ్ ఇచ్చి, మూవీ లో వాడిన బ్యాట్ గిఫ్ట్‌గా ఇచ్చిన చరణ్ అన్నకు ధన్యవాదాలు’ అని తిలక్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ ఘటనతో ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం అభిమానులను ఆకట్టుకుంటోంది. కాగా వచ్చే నెలలోనే ఈ మూవీ గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రం షూటింగ్లో తిలక్ వర్మ పాల్గొనడం ప్రమోషన్ పరంగాను మూవీకి బలంగా మారింది.