Wednesday, 22 July 2026
SWASTHIK NEWS
Home / మార్కాపురం

ఐ.టి.వరంలో విజయవంతంగా 'SIR' కార్యక్రమం

24 Jun 2026
06:50 PM
539

స్వస్తిక్ న్యూస్ , యర్రగొండపాలెం :-యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారి ఆదేశాల మేరకు, పుల్లలచెరువు మండలం ఐ.టి.వరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR - ఓటరు నమోదు, సవరణల) కార్యక్రమాన్ని బుధవారం విజయవంతంగా నిర్వహించాయి.గ్రామంలోని నాలుగు పోలింగ్ బూత్‌ల పరిధిలో బూత్ లెవల్ ఏజెంట్లు (BLAs), పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. నూతన ఓటరు నమోదుతో పాటు, ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు మరియు సవరణలకు సంబంధించిన దరఖాస్తులను ప్రజల నుండి నేరుగా స్వీకరించారు. అదేవిధంగా, ఓటరు జాబితా సవరణల ఆవశ్యకతపై గ్రామస్తులకు విస్తృతంగా అవగాహన కల్పించారు.ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు హక్కు అత్యంత కీలకమైన ఆయుధమని ఈ సందర్భంగా నాయకులు స్పష్టం చేశారు.

Article Image

 18 ఏళ్లు నిండిన అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటరు వివరాలను విధిగా నమోదు చేసుకొని, ప్రజాస్వామ్య బలోపేతానికి తమ వంతు బాధ్యతగా సహకరించాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పుల్లలచెరువు మండల పార్టీ అధ్యక్షులు పోట్ల గోవిందు, ముటుకుల సొసైటీ చైర్మన్ పావులూరు యోగేశ్వరరావు, యూనిట్ ఇన్‌చార్జ్ సూరబతుని రమేష్, నల్లపాటి ఏడుకొండలు (మందులు కొట్టు), సురబత్తుని గోవిందరాజులు, మగులూరి స్యమేలు, గూడూరి సులేమాన్, ఎస్సీ పాలెం టీడీపీ నాయకులు, బూత్ స్థాయి ఏజెంట్లు మరియు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!

Related Articles

Recent Updates