స్వస్తిక్ న్యూస్, సినిమా:-
హైదరాబాద్:- గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం 'డ్రాగన్' కోసం మునుపెన్నడూ లేని విధంగా మేకోవర్ అవుతున్నారు. ఈ సినిమా కోసం ఆయన తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకుంటూ ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరుస్తున్నారు.తాజాగా ఎన్టీఆర్ జిమ్లో కసరత్తులు చేస్తూ, తన కండలు తిరిగిన దేహాన్ని ప్రదర్శిస్తున్న ఒక ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. వెనుక భాగం నుంచి తీసిన ఈ ఫోటోలో తారక్ 'బాడీ బాక్స్ ఆఫీస్' రేంజ్‌లో కనిపిస్తుండటంతో అభిమానులు ఫిదా అవుతున్నారు.
హైలైట్స్:- పూర్తి మేకోవర్: 'డ్రాగన్' సినిమా డిమాండ్ మేరకు ఎన్టీఆర్ ఫిజిక్‌ను సిద్ధం చేసుకుంటున్నారు.
వైరల్ ఫోటో:- పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది.
ఫ్యాన్స్ జోష్:- "తారక్ బాడీ బాక్స్ ఆఫీస్" అంటూ నెటిజన్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.
ప్రస్తుతం ఈ ఫోటో సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. తన అంకితభావంతో ఎన్టీఆర్ మరోసారి బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడానికి సిద్ధమవుతున్నారని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.