పుల్లలచెరువు, స్వస్తిక్ న్యూస్ :- మండల కేంద్రంలోని పిఎంశ్రీ జిల్లా పరిషత్ హైస్కూల్లో పదవతరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థిని,విద్యార్ధులకు పుల్లలచెరువు మండల మల్లాపాలెం వాస్తవ్యులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సంస్థల సలహా దారులు, డాక్టర్ ఆవుల నాసర్ రెడ్డి శుభాకాంక్షలు, ఆశీస్సులు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదో తరగతి విద్యార్థిని, విద్యార్ధులు బోర్డు పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని, యోగ, ధ్యానం ప్రతిరోజు చేయాలని, మంచిగా చదువుకొని , ఉత్తమ ఫలితాలు సాధించి మండలానికి, తల్లిదండ్రులకు,ఉపాధ్యాయులకు,పాఠశాలకు మంచి పేరు తేవాలని కోరారు.