స్వస్తిక్ న్యూస్, స్పోర్ట్స్:- ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాళ్లలో ఒకడైన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామరూన్ గ్రీన్ ఇప్పుడు కోల్‌కతా నైట్ రైడర్స్ అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నారు. భారీ అంచనాలతో జట్టులోకి వచ్చిన గ్రీన్, వరుస వైఫల్యాలతో నిరాశపరుస్తుండటమే దీనికి కారణం.నిరాశపరిచిన గణాంకాలు ఐపీఎల్ వేలంలో రూ. 25.2 కోట్ల రికార్డు ధర వెచ్చించి కొనుగోలు చేసిన గ్రీన్, ఈ సీజన్‌లో ఆడిన 5 మ్యాచ్‌ల్లో కేవలం 18, 2, 4, 32, 0 పరుగులు మాత్రమే చేయగలిగారు. ముఖ్యంగా నిన్న చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తో జరిగిన కీలక మ్యాచ్‌లో జట్టుకు పరుగుల అవసరమున్న సమయంలో 'గోల్డెన్ డక్' (తొలి బంతికే అవుట్) గా వెనుదిరగడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది.సోషల్ మీడియాలో ట్రోల్స్ వర్షం.గ్రీన్ పేలవ ప్రదర్శనపై కేకేఆర్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు.రూ. 25 కోట్లు దండగ.." అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.అసలు ఇంత భారీ ధర ఇచ్చి ఇతడిని ఎందుకు తీసుకున్నారంటూ ఫ్రాంచైజీ మేనేజ్‌మెంట్‌ను ప్రశ్నిస్తున్నారు.
మరికొందరైతే ఏకంగా ఇతడొక 'ఫ్రాడ్' అంటూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.జట్టులో కీలక ఆటగాడిగా మారతారనుకున్న గ్రీన్, వరుసగా విఫలమవుతుండటంతో కేకేఆర్ ప్లేఆఫ్స్ అవకాశాలపై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందోనని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.