స్వస్తిక్ న్యూస్, ఫాక్ట్స్:-ఎండలు మండిపోతున్న నేపథ్యంలో ప్రజలు తమ ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ కీలక సూచనలు చేసింది. వేసవి తాపం నుండి ఉపశమనం పొందేందుకు మరియు శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌గా (తేమగా) ఉంచుకోవాలని సూచించింది.ముఖ్యంగా డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండేందుకు కృత్రిమ పానీయాల కంటే ప్రకృతి సిద్ధంగా లభించే పానీయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆరోగ్య శాఖ పేర్కొంది.ఆరోగ్య శాఖ సూచించిన సహజ సిద్ధ పానీయాలు శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్స్‌ను అందిస్తూ, శక్తిని ఇచ్చే పానీయాలు ఇవే కొబ్బరి నీళ్లు ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.పుచ్చకాయ రసం శరీరంలో నీటి శాతాన్ని పెంచుతుంది.నిమ్మ రసం విటమిన్ సి అందిస్తూ రీఫ్రెషింగ్‌గా ఉంచుతుంది.మజ్జిగ శరీరాన్ని చల్లబరిచి జీర్ణక్రియకు తోడ్పడుతుంది.మామిడి రసం వేసవిలో లభించే పోషక విలువలున్న పానీయం.
ముఖ్య గమనిక:-ఈ సహజ సిద్ధమైన పానీయాలు తీసుకోవడం వల్ల ఎండ దెబ్బ (Sunstroke) నుండి రక్షణ పొందవచ్చని, కోల్పోయిన శక్తిని తిరిగి పొందవచ్చని అధికారులు వెల్లడించారు. వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ఈ జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య శాఖ కోరింది.