స్వస్తిక్ న్యూస్, తెలంగాణ :- తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నాగర్‌కర్నూల్, ములుగు జిల్లాల్లో ఇవాళ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కూడా కుండపోతగా వర్షం పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఒక్కసారిగా భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బయటకు వెళ్లే వారు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరించారు. మరోవైపు రైతన్నలు సైతం ఈ వర్షాల పట్ల ముందుగానే జాగ్రత్తలు వహించాలి అని.. లేదంటే పంటలు తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి అని స్పష్టం చేశారు.