Tuesday, 21 April 2026
SWASTHIK NEWS
Home / క్రీడలు

​పంజాబ్ పవర్ హిట్టర్ ప్రభ్‌సిమ్రాన్ విధ్వంసం: మ్యాచ్‌ను మలుపు తిప్పే సత్తా అతని సొంతం

20 Apr 2026
01:16 PM
19

స్వస్తిక్ న్యూస్, స్పోర్ట్స్ ​:- ఐపీఎల్ (IPL) తాజా సీజన్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ తన అద్భుతమైన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న శ్రేయస్‌తో పాటు, ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ ఇన్నింగ్స్ జట్టుకు కొండంత అండగా నిలుస్తోంది.​అన్‌క్యాప్డ్ ప్లేయర్.. అసాధారణ ఆట బౌలర్ ఎవరన్నది లెక్క చేయకుండా సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడటం ఈ అన్‌క్యాప్డ్ ప్లేయర్ స్పెషాలిటీ. క్లిష్ట సమయాల్లో సైతం మ్యాచ్‌ను తన వైపు తిప్పుకోగల సామర్థ్యం అతనికి ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.​గణాంకాల్లో ప్రభ్‌సిమ్రాన్ ప్రభంజనం.ప్రభ్‌సిమ్రాన్ ఇప్పటివరకు ఐపీఎల్ కెరీర్‌లో సాధించిన రికార్డులు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

​మొత్తం మ్యాచ్‌లు: 56

​మొత్తం పరుగులు: 1,516

​స్ట్రైక్ రేట్: 154

 2023 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై అద్భుత సెంచరీతో చెలరేగారు.

​2026 సీజన్‌లో అజేయంగా..

​ప్రస్తుత 2026 సీజన్‌లో ప్రభ్‌సిమ్రాన్ ఫామ్ భీభత్సంగా ఉంది. కేవలం 5 మ్యాచ్‌ల్లోనే 70 సగటుతో 211 పరుగులు సాధించి పరుగుల వరద పారిస్తున్నారు.నేను ఇటీవల యువరాజ్ సింగ్ వద్ద శిక్షణ తీసుకున్నాను, అది నా బ్యాటింగ్‌లో ఎంతో మార్పు తెచ్చింది" అని ప్రభ్‌సిమ్రాన్ తన విజయ రహస్యాన్ని వెల్లడించారు.యువీ శిష్యరికంలో రాటుదేలిన ఈ యువ ఆటగాడు మున్ముందు ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తాడో వేచి చూడాలి!

Swasthik News

Share this Article

Chenna

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!

Related Articles

Recent Updates