పుల్లలచెరువులో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు.
(స్వస్తిక్ న్యూస్, పుల్లలచెరువు :-)
భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు పుల్లలచెరువులో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి ఎస్సై సాంబ శివరావు,టీడీపీ,వైసీపీ కన్వీనర్లు పోట్ల. గోవింద్, దోమకాల. వెంకటేశ్వర్లు పలువురు నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.అనంతరం యూత్ సభ్యులు ఎలిశెల. ఏడుకొండలు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో పలువురు వక్తలు మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారతదేశానికి సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ అనే విలువలను అందించిన మహానుభావుడని.పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం జీవితాంతం పోరాడిన గొప్ప నాయకుడని, సమాజంలో ఉన్న అంటరానితనం, వివక్ష, అసమానతలను నిర్మూలించేందుకు ఆయన చేసిన కృషి అపారమైనదన్నారు.భారత రాజ్యాంగం ద్వారా ప్రతి పౌరుడికి సమాన హక్కులు, అవకాశాలు కల్పించిన ఘనత అంబేద్కర్ విద్య, సామాజిక న్యాయం, హక్కుల సాధనలో యువత అంబేద్కర్ మార్గాన్ని అనుసరించాలన్నారు.ఆ రాజ్యాంగానికి ప్రాణం పోసిన మహనీయుడు అంబేద్కర్ స్ఫూర్తితో సమాజ సేవలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.మండల వైస్ ఎంపీపీ రాములు,టీడీపీ మాజీ కన్వీనర్లు పయ్యావుల ప్రసాద్, బాధరయ్య, సర్పంచ్ ఓబులేష్, జనసేన నాయకులు ఆర్మీ బుజ్జి,జిల్లా వైసీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ రఘు,సిపిఐ కార్యదర్శి గురునాధం,ఖాసీమ్,టీడీపీ నాయకులు ఉప్పల హనుమంతు, ఇదెమ్మ యాదవ్,నాయుడుపాలెం ఎంపీటీసీ పెద్దిటి. వెంగయ్య,నియోజకవర్గ మాలల ఐక్య వేదిక నాయకులు,అంబేద్కర్ యూత్ నాయకులు గొట్టెముక్కుల.అంజిబాబు, రాము,తదితరులు పాల్గొన్నారు.