»నవోదయ విద్యాలయాలకు ఎంపికైన పుల్లల చెరువు విద్యార్థులు.
»అభినందనలు తెలిపిన కరెస్పాండంట్ వి. వీరయ్య.
స్వస్తిక్ న్యూస్, పుల్లలచెరువు:-
నవోదయ విద్యా సమితిలో 6 వ తరగతిలో ప్రవేశాలకు పుల్లలచెరువులోని ఎంఎన్ డీకే పాఠశాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.అభిషేక్, నిఖిల్, నెహెమ్యా అనే ముగ్గురు విద్యార్థులు మంగళవారం
విడుదల అయిన ఫలితాల్లో సీట్లు పొందడంతో బుధవారం ఆ పాఠశాల కరస్పాండెంట్ వేముల వీరయ్య ఆ విద్యార్థులను అభినందించారు. తమ పాఠశాల సిబ్బంది అత్యుత్తమ శిక్షణను అందివ్వడం ద్వారా ఈ ఘనత సాధ్యమైందని ఆయన అన్నారు. సీట్లు పొందిన విద్యార్థుల తల్లిదండ్రులను సత్కరించారు. కార్యక్రమంలో ఆ పాఠశాల సిబ్బంది, నవోదయ శిక్షకులు పసుపులేటి సుబ్బారావు, ఉపాధ్యాయురాలు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.