స్వస్తిక్ న్యూస్, ఆంధ్రప్రదేశ్ :- భారత ప్రధానిగా, ముఖ్యమంత్రిగా అత్యధిక రోజులు ప్రజాసేవ అందించిన ప్రజాప్రతినిధిగా (8,931 రోజులు) ప్రదాని నరేంద్ర మోదీ రికార్డు సృష్టించినందుకుగాను ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశంసించారు . ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదిక ఎక్స్ (ట్విట్టర్) ద్వారా వెల్లడించారు. ఈ మైలురాయి తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని, ఇది అతని పట్టుదల, ప్రజల పట్ల నిబద్ధతకు నిదర్శనమని జగన్ పేర్కొన్నారు. మోదీకి ఇంతకాలం ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన ప్రజలకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆశీస్సులు, మద్దతుతోనే నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ప్రజాసేవ చేయగలిగారని ఆయన అన్నారు. ఇలానే ఆరోగ్యంగా ఉంటూ దేశాన్ని మరింత అభివృద్ధి చేయాలని కోరారు. కాగా ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ కూడా ప్రథాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపారు.