స్వస్తిక్ న్యూస్, నేషనల్:-భారతీయ వ్యాపార దిగ్గజాల మధ్య మరోసారి ఆసక్తికరమైన మార్పు చోటుచేసుకుంది. గౌతమ్ అదానీ మరోసారి ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ (Bloomberg Billionaires Index) తాజా గణాంకాల ప్రకారం, ముకేశ్ అంబానీని వెనక్కి నెట్టి అదానీ అగ్రస్థానానికి చేరుకున్నారు.
నికర ఆస్తి విలువల వివరాలు:-ప్రస్తుత నివేదికల ప్రకారం వీరి ఆస్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
గౌతమ్ అదానీ: $92.6 బిలియన్లు
ముకేశ్ అంబానీ: $90.8 బిలియన్లు
ప్రపంచ స్థాయి ర్యాంకులు జాబితాలో అదానీ ప్రస్తుతం 19వ స్థానంలో నిలవగా, అంబానీ 20వ స్థానానికి చేరుకున్నారు. కాగా, ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా ఎలాన్ మస్క్ తన హవాను కొనసాగిస్తున్నారు. మస్క్ నికర ఆస్తి విలువ $656 బిలియన్లుగా నమోదైంది.స్టాక్ మార్కెట్‌లో అదానీ గ్రూప్ షేర్ల విలువ పెరగడమే ఆయన తిరిగి అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.