స్వస్తిక్ న్యూస్, పుల్లలచెరువు :- పుల్లలచెరువు మండలం, మల్లపాలెం గ్రామం లో జరిగిన శ్రీ సుబ్బారెడ్డి స్వామి తిరుణాల మహోత్సవం సందర్భంగా యర్రగొండపాలెం శాసనసభ్యులు శ్రీ తాటిపర్తి చంద్రశేఖర్ ఆహ్వానం మేరకు పల్నాడు జిల్లా వైయస్. ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాచర్ల మాజీ శాసనసభ్యులు శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రతి వైసీపీ కార్యకర్తకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. మరో రెండేళ్లు సహనంతో ఉండండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే నాయకులు, అధికారుల పేర్లు మొత్తం డిజిటల్ బుక్ లో నమోదు చెయ్యండి. వీళ్ళు చేసే అరాచకాలు ప్రజలు గమనిస్తున్నారు. మన అధికారంలోకి రాగానే ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు, వారందరి పై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని.. మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాను అని తెలిపారు.
