Monday, 23 March 2026
SWASTHIK NEWS
Home / నేర వార్తలు

సైబర్ వలలో చిక్కిన ఎమ్మెల్యే.. 12 లక్షలు మటాష్

22 Mar 2026
12:54 PM
243

స్వస్తిక్ న్యూస్, ఆంధ్ర ప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యే బాలరాజు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆర్టీఏ చలానా పేరుతో ఆయనకు ఓ లింక్ పంపించిన నేరగాళ్లు, దానిపై క్లిక్ చేయగానే ఆయన బ్యాంక్ ఖాతా నుంచి దాదాపు రూ.12 లక్షలను మాయం చేశారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఎమ్మెల్యే ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే తన బ్యాంక్ అధికారులను సంప్రదించి ఖాతాను బ్లాక్ చేయించారు.ఈ ఘటనపై ఎమ్మెల్యే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సైబర్ నేరగాళ్లు పంపిన లింక్, ఉపయోగించిన ఫోన్ నంబర్లు, బ్యాంక్ లావాదేవీల వివరాల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది. ఈ మోసం చాలా ప్రణాళికాబద్ధంగా జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.ఈ ఘటనపై ఎమ్మెల్యే ప్రజలను అప్రమత్తం చేశారు. అపరిచితుల నుంచి వచ్చే లింక్‌లు, APK ఫైళ్లు డౌన్‌లోడ్ చేయవద్దని, బ్యాంక్ వివరాలు ఎవరికీ చెప్పవద్దని సూచించారు. చిన్న పొరపాటు కూడా పెద్ద నష్టానికి దారితీస్తుందని, ప్రతి ఒక్కరూ సైబర్ మోసాలపై జాగ్రత్తగా ఉండాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!

Related Articles

Recent Updates