స్వస్తిక్ న్యూస్, స్పోర్ట్స్ RCB VS MI :-
ముంబై:- వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. నిర్ణీత ఓవర్లలో ఆర్‌సీబీ 4 వికెట్ల నష్టానికి 240 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది.
బ్యాటర్ల వీరవిహారం:- ఆర్‌సీబీ బ్యాటర్లు ముంబై బౌలర్లపై కనికరం లేకుండా విరుచుకుపడ్డారు. ప్రధానంగా నలుగురు బ్యాటర్లు మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు:
సాల్ట్:- 78 పరుగులు (కేవలం 36 బంతుల్లో)
రజత్:- 53 పరుగులు (20 బంతుల్లో)
విరాట్ కోహ్లీ:-50 పరుగులు (38 బంతుల్లో)
డేవిడ్:- 34* పరుగులు (16 బంతుల్లో - నాటౌట్)మొత్తం ఇన్నింగ్స్‌లో ఆర్‌సీబీ బ్యాటర్లు 15 సిక్సర్లు, 18 ఫోర్లతో మైదానాన్ని హోరెత్తించారు.బౌలింగ్ ప్రదర్శన:ముoబై ఇండియన్స్ బౌలర్లలో హార్దిక్ పాండ్యా, శాంట్నర్, శార్దూల్ ఠాకూర్ మరియు బౌల్ట్ తలో ఒక వికెట్ పడగొట్టారు. అయితే, ఆర్‌సీబీ బ్యాటర్ల ధాటికి అందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు.ముంబై ముందు ఇప్పుడు 241 పరుగుల భారీ లక్ష్యం ఉంది. వాంఖడే వంటి చిన్న మైదానంలో ఈ ఛేజింగ్ ఆసక్తికరంగా మారనుంది.