»సేవ వాటర్ - సేవ లైఫ్
స్వస్తిక్ న్యూస్, తాడేపల్లి :- తాడేపల్లి మండలం గుడ్ షెఫర్డ్ కాన్వెంట్ సిస్టర్స్ స్వచ్ఛంద సంస్థ వారి చైల్డ్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్ లో భాగంగా ఆదివారం సాయంత్రం డోలస్ నగర్ ఏరియాలో ఉన్న బాలగంగాధర్ తిలక్ బాలల పార్లమెంట్ గ్రూప్ మీటింగ్ ఏర్పాటు చేసి ప్రత్యేకత అయిన ప్రపంచ నీటి సంరక్షణ దినోత్సవం గురించి చైతన్యం కల్పించటం జరిగింది.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చైల్డ్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్ సిబ్బంది అత్తోట పోతురాజు మాట్లాడుతూ జీవకోటికి ప్రాణాధారం,రంగు, రుచి,వాసన లేని ప్రకృతి ప్రసాదిత ద్రవం నీరు భూమిపై 71% నీరు ఉన్నా, యోగ్యమైనది త్రాగటానికి ఉపయోగపడే నీరు కేవలం 1% లోపే ఉందని అలానే మానవ శరీరంలో సుమారు 60-70% నీరు ఉంటుందిని ఇది జీర్ణక్రియకు, శరీర ఉష్ణోగ్రత నియంత్రణకు, పోషకాల రవాణాకు అత్యంత నిత్యవసరం అని నీటిని పొదుపుగా వాడటం, కలుషితం కాకుండా చూడటం మన అందరి బాధ్యత అని నీటి ప్రాముఖ్యత మరియు ఉపయోగాలు గురించి వివరిస్తూ జీవ మనుగడ,మానవుల, జంతువుల,మొక్కల ప్రాణాలకు నీరు అత్యంత ముఖ్యం అలానే ప్రతీరోజూ తగినంత నీరు తాగడం వల్ల మన శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి,చర్మం ఆరోగ్యంగా ఉంటుంది,కీళ్ల నొప్పులు తగ్గుతాయని వ్యవసాయం మరియు పంటల సాగుకు, పారిశ్రామిక ఉత్పత్తికి నీరు వెన్నెముక అని మన దైనందిన జీవితంలో స్నానం, వంట,శుభ్రతకు నీరు చాలా అవసరం అని నీటి సంరక్షణ కొరకు వర్షపు నీటిని నిల్వ చేయడం భవిష్యత్ తరాల అవసరాలకు అత్యంత ముఖ్యం అని కుళాయిలు తెరిచి ఉంచకుండా నీటి వృథా అరికట్టాలి అనినీటి కాలుష్యాన్ని తగ్గించటానికి ప్రతీ ఒక్కరూ సహకరించాలి అని భూమిపై జీవం నిలబడాలంటే నీటిని పొదుపు చేయడం, దాని విలువను గుర్తించడం చాలా ముఖ్యం అని ముఖ్యంగా మనమందరం పళ్లు తోముకునేటప్పుడు, పెద్దలు షేవింగ్ చేసుకునేటప్పుడు, మహిళలు పాత్రలు కడిగేటప్పుడు అవసరం లేనప్పుడు కుళాయిని ఆపివేసే విధంగా, షవర్ కి బదులు బకెట్ మరియు మగ్గు ఉపయోగించడం ద్వారా చాలా నీటిని ఆదా చేయవచ్చు అని ఇంట్లో లీక్ అవుతున్న కుళాయిలు, పైపులను వెంటనే బాగు చేయించాలి లేదంటే ఇవి వందల లీటర్ల నీటిని వృథా చేస్తాయి అని కూరగాయలు, పండ్లు కడగడానికి రన్నింగ్ వాటర్ బదులు బౌల్‌లో నీటిని ఉపయోగించడం వల్ల నీటిని పొదుపు చేయవచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమం లో బాల గంగాధర్ తిలక్ బాలల పార్లమెంట్ గ్రూప్ సబ్యులు గ్రామస్థులు పాల్గొన్నారు .