Sunday, 19 April 2026
SWASTHIK NEWS
Home / రాజకీయం

​జగన్ ఒక ‘మూవింగ్ జోకర్’: వైఎస్ షర్మిల ధ్వజమెత్తు

09 Apr 2026
05:53 PM
96

స్వస్తిక్ న్యూస్, రాజకీయం:-

అమరావతి:- ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ కేవలం వైఎస్సార్ పేరును వాడుకున్నారే తప్ప, ఆయన ఆశయాలకు వారసుడు కాలేకపోయారని ఆమె మండిపడ్డారు.

షర్మిల చేసిన ప్రధాన విమర్శలు:- దేశంలో క్రైస్తవ మైనారిటీలపై దాడులు జరుగుతుంటే, వైఎస్సార్ వారసుడిగా చెప్పుకునే జగన్ వాటిని ఎందుకు ఖండించలేదని ఆమె ప్రశ్నించారు.

రాజధానుల పేరుతో మోసం:- మూడు రాజధానుల పేరు చెప్పి రుషికొండను మింగేసి, అక్కడ విలాసవంతమైన ప్యాలెస్‌లు కట్టుకున్నారని ఆరోపించారు.

లిక్కర్ మాఫియా:-  సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని మాట ఇచ్చి, రాష్ట్రంలో కల్తీ మద్యం అమ్ముతూ ‘ఓన్లీ క్యాష్’ మాఫియాను నడిపించారని విమర్శించారు.

తీవ్ర వ్యాఖ్యలు:- రాజకీయాల్లో జగన్ ఇప్పుడు ఒక ‘మూవింగ్ జోకర్’ లా మిగిలిపోయారని షర్మిల ఎద్దేవా చేశారు.ఈ మేరకు జగన్ పాలనలో జరిగిన వైఫల్యాలను ఎండగడుతూ ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!

Related Articles

Recent Updates