స్వస్తిక్ న్యూస్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్‌లో మధ్యాహ్నం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మేఘావృత వాతావరణం కొనసాగుతుండగా, కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ఉభయ గోదావరి, గుంటూరు, పల్నాడు, అనంతపురం, విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

అలాగే రాయలసీమ ప్రాంతంలోని తిరుపతి, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని తెలిపారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని, వర్షాల సమయంలో జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.