స్వస్తిక్ న్యూస్, మార్కాపురం జిల్లా:-
ప్రకాశం:- జిల్లాలో మానవత్వం మంటగలిసే ఘటన చోటుచేసుకుంది. రక్షణగా ఉండాల్సిన తండ్రే కామాంధుడిగా మారి కన్న కూతురిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు.
ఘటన వివరాలు:-ప్రాంతం: ప్రకాశం జిల్లా, మార్కాపురం తాళ్లూరు మండలం.బాధితురాలు: 13 ఏళ్ల బాలిక.
ఏం జరిగింది?:- నిందితుడైన తండ్రి గత రెండు నెలల కాలంలో తన కూతురిపై మూడు సార్లు లైంగిక దాడికి పాల్పడ్డా రెండు, మూడు రోజులుగా బాలిక తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతుండటంతో, కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం ఒంగోలు రిమ్స్ (RIMS) ఆసుపత్రికి తరలించారు. అక్కడ బాలికను పరీక్షించిన వైద్యులు అసలు విషయాన్ని బయటపెట్టారు. వైద్యులు అందించిన సమాచారంతో ఈ దారుణం వెలుగు చూసింది.
పోలీసుల చర్యలు:-వైద్యుల ఫిర్యాదు మరియు వివరాల మేరకు తాళ్లూరు పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ కేసు నమోదు చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకునే దిశగా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.