స్వస్తిక్ న్యూస్,ఆరోగ్య విభాగం:- మనం అనారోగ్యం బారిన పడినప్పుడు ఉపశమనం కోసం మాత్రలు లేదా మందులు వాడుతుంటాం. అయితే, ఆ మందులను ఎలా వేసుకుంటున్నామనే దానిపైనే అవి మన శరీరంపై చూపే ప్రభావం ఆధారపడి ఉంటుంది. తాజాగా వైద్య నిపుణులు మందుల వాడకానికి సంబంధించి కొన్ని కీలక సూచనలు జారీ చేశారు.గోరువెచ్చని నీరే శ్రేయస్కరం.చాలామంది మాత్రలు వేసుకునేటప్పుడు చల్లటి నీటిని వాడుతుంటారు. అయితే, చల్లటి నీటితో మాత్రలు వేసుకోవడం వల్ల అవి కరగడానికి ఎక్కువ సమయం పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల మందు ప్రభావం ఆలస్యమవుతుంది. కాబట్టి, మాత్రలను గాజు గ్లాసుడు గోరువెచ్చని నీటితో తీసుకోవడం ఉత్తమమని వారు సూచిస్తున్నారు.వీటితో మందులు తీసుకోవద్దు.మందులను నీటితో కాకుండా ఇతర పానీయాలతో తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. ముఖ్యంగాపాలు, జ్యూస్ వీటితో మందులు వేసుకుంటే వాటి ప్రభావం తగ్గుతుంది.
కూల్ డ్రింక్స్, మొందులు కలిపి తీసుకోవడం వల్ల తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది.మాత్రలను పొడి చేయకండికొందరు మాత్రలను మింగలేక వాటిని పొడి చేసి లేదా నీటిలో కలిపి తీసుకుంటారు. ఇలా చేయడం అత్యంత ప్రమాదకరం.మాత్రలను పొడి చేయడం వల్ల మందు మొత్తం ఒకేసారి శరీరంలోకి విడుదలయ్యే ప్రమాదం ఉంది. ఇది ప్రాణాపాయానికి కూడా దారితీయవచ్చు" అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.సలహా మందులు వాడేటప్పుడు ఎల్లప్పుడూ వైద్యుల సూచనలను పాటించడం మరియు తగినంత నీటిని తీసుకోవడం మీ ఆరోగ్యానికి రక్షణ.