Tuesday, 14 April 2026
SWASTHIK NEWS
Home / ఆసక్తికరమైన నిజాలు

తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న చికెన్ ధరలు: ఏ నగరంలో ఎంతంటే?

12 Apr 2026
08:03 AM
11

హైదరాబాద్:- తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ప్రియులకు ధరలు షాక్ ఇస్తున్నాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతున్న ఎండల ప్రభావంతో పాటు ఇతర కారణాల వల్ల చికెన్ ధరలు భారీగా పెరిగాయి. నేడు కేజీ స్కిన్‌లెస్ చికెన్ ధర వివిధ ప్రాంతాల్లో రూ. 230 నుండి రూ. 320 మధ్య పలుకుతోంది.

ప్రధాన నగరాల్లో ధరల వివరాలు (కేజీ స్కిన్‌లెస్):

నగరం/ప్రాంతం ధర (రూపాయల్లో)

హైదరాబాద్ రూ. 260 - రూ. 280

వరంగల్ రూ. 260

కామారెడ్డి రూ. 270 - రూ. 280

విజయవాడ రూ. 220

గుంటూరు రూ. 260

రాజమండ్రి రూ. 240

అద్దంకి (ప్రకాశం) రూ. 320

నూజివీడు రూ. 300

నంద్యాల రూ. 280 - రూ. 300

ప్రస్తుతం ప్రకాశం జిల్లా అద్దంకిలో అత్యధికంగా రూ. 320 ధర ఉండగా, విజయవాడలో సాపేక్షంగా తక్కువగా రూ. 220 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. వేసవి తీవ్రత దృష్ట్యా సరఫరా తగ్గడంతో రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.

Swasthik News

Share this Article

Chenna

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!

Related Articles

Recent Updates