స్వస్తిక్ న్యూస్,ఆంధ్రప్రదేశ్ :- నేడు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితుల ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.శ్రీకాకుళం, విజయనగరం, మన్యం మరియు అల్లూరి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని APSDMA పేర్కొంది. ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు ఉండే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అలాగే పల్నాడు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం మరియు తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వాతావరణ సమాచారం కోసం ప్రజలు తాజా అప్‌డేట్లను గమనిస్తూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు.