స్వస్తిక్ న్యూస్, ఆంధ్రప్రదేశ్ :- పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వాతావరణ శాఖ వర్ష సూచనలు జారీ చేసింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని కొన్ని జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. వేసవికాలం మొదలైనప్పటికీ వాతావరణం లో చోటుచేసుకున్నటువంటి మార్పులు కారణంగా దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో మరికొద్ది సేపట్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో వడగళ్ల వాన కూడా పడే అవకాశముందని పేర్కొన్నారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరి ముఖ్యంగా వ్యవసాయం చేస్తున్నటువంటి రైతన్నలు పండిస్తున్నటువంటి పంట విషయంలో వర్షం నుంచి ఎలా కాపాడుకోవాలని విషయంపై జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అలాగే, మరో రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశముందని.. ప్రతి ఒక్కరు కూడా అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు అని సూచించారు. ఇప్పటికే ఒకవైపు భారీ ఎండలతో ప్రజలు అల్లాడిపోతుంటే మరోవైపు వర్షాల కారణంగా రైతన్నలు నష్టం చవి చూస్తున్నారు.