Tuesday, 21 July 2026
SWASTHIK NEWS
Home / మార్కాపురం

గిద్దలూరు: అనుమానంతో భార్యను దారుణంగా హత్య చేసిన భర్త

05 Jul 2026
07:42 AM
81

స్వస్తిక్ న్యూస్, మార్కాపురం:-జిల్లాలో శనివారం ఒక తీవ్ర విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ (PS) పరిధిలో అనుమానంతో ఒక భర్త తన భార్యను దారుణంగా హత్య చేశాడు.

ఘటన వివరాలు:- మార్కాపురం జిల్లా గిద్దలూరుకు చెందిన సురేష్ అనే వ్యక్తికి, 2015లో నగరంలోని రాంనగర్‌కు చెందిన జెస్సికాతో వివాహమైంది.కుటుంబం ఈ దంపతులకు ప్రస్తుతం 10 సంవత్సరాల వయసున్న ఒక కుమార్తె ఉంది.ఘతుకం భార్య జెస్సికా (35) ప్రవర్తనపై సురేష్ కొద్దిరోజులుగా అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే శనివారం ఆమెను అత్యంత దారుణంగా హతమార్చాడు.

హత్య అనంతరం భర్త ఫోన్:-​భార్యను హత్య చేసిన అనంతరం సురేష్ నేరుగా జెస్సికా అక్కకు ఫోన్ చేశాడు. తానే స్వయంగా జెస్సికాను హత్య చేసినట్లు ఫోన్లో ఒప్పుకున్నట్లు సమాచారం అందుతోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Swasthik News

Share this Article

Chenna

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!

Related Articles

Recent Updates