Wednesday, 22 July 2026
SWASTHIK NEWS
Home / మార్కాపురం

ఘనంగా సర్పంచుల ఆత్మీయ సమ్మేళనం

03 Apr 2026
07:24 AM
79

ఘనంగా సర్పంచ్‌ల ఆత్మీయ సమ్మేళనం. 

కృతజ్ఞతాపూర్వక సన్మానం.

స్వస్తిక్ న్యూస్, యర్రగొండపాలెం:-

Article Image

 

యర్రగొండపాలెం నియోజకవర్గం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో యర్రగొండపాలెంలోని అంబేద్కర్, జగ్జీవన్ రామ్ ఆడిటోరియంలో 'ఆత్మీయ సర్పంచ్‌ల అభినందన సభ' ఘనంగా నిర్వహించారు. ఐదేళ్ల పాటు ప్రజలకు విశేష సేవలందించిన నియోజకవర్గంలోని 5 మండలాల సర్పంచ్‌లను ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజకీయంగానే కాదు.. కష్టమొచ్చినా, ఆపద వచ్చినా, పండుగ వచ్చినా.. అందరూ ఒకటిగానే ఉన్నాం. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సొంత మనిషిలా మీకు సాయం చేశాను.. మీరు కూడా నన్ను ఒక నాయకుడిగా కంటే ఒక కుటుంబ పెద్దగా భావించి ఆదరించారు. గత ఎన్నికల్లో నా గెలుపులో కీలక పాత్ర పోషించిన ప్రతి సర్పంచ్‌కు నా హృదయపూర్వక ధన్యవాదాలు."అన్నారు.

 ఏప్రిల్ 2వ తేదీతో సర్పంచ్‌ల పదవీ కాలం ముగుస్తున్న సందర్భంగా, వారి సేవలను గుర్తు చేస్తూ ఈ అభినందన సభను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్బంగా పుల్లలచెరువు మండలం మల్లాపాలేనికి చెందిన మాజీ సర్పంచ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్,టీజీ వ్యవసాయ సంస్థల అడ్వైజరు డాక్టర్ ఆవుల. నాసర్ రెడ్డి సర్పంచులకు, ప్రజా ప్రతినిధులకు, నాయకులకు ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే చంద్రశేఖర్ వారికి అభినందనలు తెలిపారు.

Swasthik News

Share this Article

yedukondalu. Sr. Journalist

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!

Related Articles

Recent Updates