స్వస్తిక్ న్యూస్, అంతర్జాతీయం :- భూగోళ శాస్త్రం మరియు సాధారణ జ్ఞానం పట్ల ఆసక్తి ఉన్నవారికి ఖండాలు, వాటిలోని దేశాల సంఖ్య గురించి తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. ప్రపంచంలో మొత్తం ఏడు ఖండాలు ఉన్నాయి. వాటిలో ఆఫ్రికా ఖండంలో అత్యధిక దేశాలు ఉండగా, అంటార్కిటికాలో ఒక్క దేశం కూడా లేదు.

ఏ ఖండంలో ఎన్ని దేశాలు ఉన్నాయో ఒకసారి చూద్దాం...!
»ఆఫ్రికా (Africa): 54 దేశాలు
«ఆసియా (Asia): 49 దేశాలు
»యూరప్ (Europe): 45 దేశాలు
»ఉత్తర అమెరికా (North America): 23 దేశాలు
»ఆస్ట్రేలియా/ఓషియానియా (Australia/Oceania): 14 దేశాలు
»దక్షిణ అమెరికా (South America): 12 దేశాలు
»అంటార్కిటికా (Antarctica): 0 దేశాలు.

ఇక్కడ శాశ్వత మానవ నివాసాలు లేవు. మంచుతో కప్పబడి ఉండే ఈ ఖండంలో, వివిధ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు మరియు పరిశోధకులు మాత్రమే వారి పరిశోధనల నిమిత్తం తాత్కాలికంగా ఉంటారు.పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఈ ప్రాథమిక సమాచారం ఎంతగానో ఉపయోగపడుతుంది.