Monday, 23 March 2026
SWASTHIK NEWS
Home / సినిమా

ఫ్యాన్స్ కోసం అంటే పవన్ సార్ ఓకే అంటారు : హీరోయిన్ శ్రీలీల

17 Mar 2026
10:38 AM
359

స్వస్తిక్ న్యూస్, సినిమా :- ఉస్తాద్  భగత్ సింగ్ సినిమా గురించి హీరోయిన్ శ్రీలీల ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ చిత్రంలో నటిస్తున్న సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  గురించి ఆమె చెప్పిన వ్యాఖ్యలు అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతున్నాయి. ఒక సన్నివేశం చిత్రీకరణ సమయంలో పవన్ కళ్యాణ్ కొంచం మొహమాటపడగా, దర్శకుడు “సర్… ఫ్యాన్స్ కోసం” అని చెప్పగానే వెంటనే అంగీకరించారని శ్రీలీల తెలిపారు. అభిమానుల కోసమైతే పవన్ కళ్యాణ్ ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారని ఆమె అన్నారు.

Article Image

ఇక గతంలో వచ్చిన గబ్బర్ సింగ్ ఎలా అయితే అభిమానుల్లో జోష్ నింపిందో, అదే స్థాయిలో ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ కూడా అలరిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సినిమా తన కెరీర్‌లో చేసిన మంచి పాత్రల్లో ఒకటిగా నిలుస్తుందని కూడా పేర్కొన్నారు.ఈ వ్యాఖ్యలతో అభిమానుల్లో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. దర్శకుడు, నటీనటుల కాంబినేషన్‌తో ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంటుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!

Related Articles

Recent Updates