స్వస్తిక్ న్యూస్, యర్రగొండపాలెం :- యర్రగొండపాలెం పట్టణంలోని APSRTC బస్టాండ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన "దివ్యాంగ్ శక్తి" పధకాన్ని యర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ ఎరిక్షన్ బాబు ప్రారంభించారు.ఈ క్రమంలో దివ్యాంగులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఆనందం వ్యక్తం చేశారు.

ఈ సందర్బంగా ఎరిక్షన్ బాబు గారు దివ్యాంగులతో కలిసి యర్రగొండపాలెం నుండి త్రిపురాంతకం వరకు బస్సులో ప్రయాణించారు.

ఈ పధకం ద్వారా దివ్యాంగుల ఆనందాన్ని ఎరిక్షన్ బాబుతో వారు పంచుకున్నారు. అనంతరం ఎరిక్షన్ బాబు శ్రీ బాల త్రిపురసుందరి దేవి అమ్మవారి ఆలయంలో దివ్యాంగులతో కలిసి దర్శనం చేసుకున్నారు. దీంతో దివ్యాంగులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. కార్యక్రమంలో RDO, RTC AM ధనలక్ష్మి , అధికారులు, టీడీపీ కూటమి నాయకులు పాల్గొన్నారు.