స్వస్తిక్ న్యూస్, తెలంగాణ :- ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో వరకట్న వేధింపుల సమస్యలు ప్రతిరోజు కూడా మనం సోషల్ మీడియా వేదికగా చూస్తూ ఉన్నాము. ఈ వరకట్నం వేధింపులతో ఇంటికి కోడలుగా వచ్చినటువంటి మహిళలు ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డారు. మరెెంతో మంది ఈ వరకట్న వేధింపులకు బలయ్యారు. గత ఐదు సంవత్సరాలలో దాదాపు 1300 మందికి పైగా మహిళలు వరకట్న వేధింపులు తట్టుకోలేక మరణించారు అని కేంద్ర ప్రభుత్వం కీలక విషయం వెల్లడించింది. తెలుగుదేశం పార్టీ ఎంపీ బైరెడ్డి శబరి లోకసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ విధంగా సమాధానం ఇచ్చారు.

2019వ సంవత్సరం నుంచి 2023 వ సంవత్సరం వరకు ఆంధ్రప్రదేశ్లో 526 మంది తెలంగాణలో 778 మంది కేసులు నమోదు అయ్యాయి అని తెలిపారు. ఈ వరకట్న వేధింపుల మరణాలలో ఉత్తరప్రదేశ్ మరియు బీహార్ రాష్ట్రాలు టాప్లో నిలిచాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 11.5 శిక్షలు ఖరారు రేటు ఉండగా ఇదే తెలంగాణలో 14. 4% ఉంది. 2023లో దేశవ్యాప్తంగా 6156 మంది ఈ వరకట్నం వేధింపులతో చనిపోయారు.