Friday, 17 April 2026
SWASTHIK NEWS
Home / ఆసక్తికరమైన నిజాలు

​నోటి పూతలే కదా అని నిర్లక్ష్యం చేయకండి.. అది క్యాన్సర్ కావొచ్చు!

15 Apr 2026
11:30 AM
99

స్వస్తిక్ న్యూస్, ఫ్యాక్స్:-చాలామంది వేసవికాలంలో వచ్చే వేడి వల్ల లేదా ఆహారపు అలవాట్ల వల్ల నోటిలో పుండ్లు (Mouth Ulcers) పడటం సహజమని భావిస్తుంటారు. అయితే, ఇలాంటి చిన్న చిన్న పుండ్లే కొన్నిసార్లు ప్రాణాంతకమైన నోటి క్యాన్సర్‌కు సంకేతాలు కావొచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఎప్పుడు అప్రమత్తం కావాలి?

​సాధారణంగా నోటి పూతలు ఒకటి లేదా రెండు వారాల్లో వాటంతట అవే తగ్గిపోతాయి. కానీ నోటిలోని పుండ్లు 14 రోజుల కంటే ఎక్కువ కాలం తగ్గకుండా ఉన్నా..ఆ పుండు రంగు మారుతున్నా లేదా గట్టి పడుతున్నా..వెంటనే డాక్టరును సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.

ముఖ్యంగా వారిలోనే ముప్పు ఎక్కువ:-పొగాకు, సిగరెట్, గుట్కా వంటి అలవాట్లు ఉన్నవారు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. నోటిలో అసాధారణ మార్పులు కనిపిస్తే వైద్యులు బయాప్సీ (Biopsy) పరీక్ష ద్వారా అది సాధారణ పుండా లేక క్యాన్సర్ సంకేతమా అనేది నిర్ధారిస్తారు.వైద్యుల సూచన నోటి క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే చికిత్స సులభం అవుతుంది. ఆలస్యం చేయడం వల్ల ప్రాణాపాయం పొంచి ఉంటుంది. ఏ చిన్న అనుమానం ఉన్నా నిర్లక్ష్యం చేయకుండా పరీక్ష చేయించుకోవడం శ్రేయస్కరం."

Swasthik News

Share this Article

Chenna

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!

Related Articles

Recent Updates