స్వస్తిక్ న్యూస్,తిరుమల:- కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు తిరుమలకు వచ్చే భక్తుల రద్దీ శుక్రవారం నాడు అమాంతం పెరిగింది. వారాంతం (వీకెండ్) కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.దీంతో ఎటువంటి దర్శన టోకెన్లు లేని సాధారణ భక్తులకు శ్రీవారి దర్శనానికి (సర్వదర్శనం) సుమారు 14 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. వారు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు.
గురువారం నాటి రద్దీ, ఆదాయం వివరాలు:- తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం నిన్నటి (గురువారం) గణాంకాలు ఈ విధంగా ఉన్నాయి. శ్రీవారిని దర్శించుకున్న మొత్తం భక్తులు 62,642, మందితలనీలాలు సమర్పించిన భక్తులు 23,887, మందిశ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.18 కోట్లు. రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అధికారులు క్యూలైన్లలో అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు తదితర సదుపాయాలను నిరంతరాయంగా అందజేస్తున్నారు.