స్వస్తిక్ న్యూస్, జాతీయం:- దేశంలో గ్యాస్ కొరతను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ సిలిండర్లతో పాటు చిన్న తరహా 5 కేజీల ఎల్పీజీ (LPG) సిలిండర్ల సరఫరాను భారీగా పెంచింది. ముఖ్యంగా వలస కార్మికులు, చిన్న కుటుంబాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు చేపట్టింది.
ముఖ్య విశేషాలు:- మార్చి 23 నుండి ఇప్పటివరకు సుమారు 13 లక్షలకు పైగా 5 కేజీల సిలిండర్లను విక్రయించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం వీటి రోజువారీ విక్రయాలు లక్ష యూనిట్ల మార్కును దాటడం విశేషం. బరువు, సులభంగా లభించే వెసులుబాటు ఉండటంతో వలస కార్మికులు ఈ 5 కేజీల సిలిండర్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అవసరాలను తీర్చడంలో భాగంగా ప్రభుత్వం మార్చి నుంచి కొత్తగా 4.24 లక్షల పీఎన్‌జీ కనెక్షన్లను యాక్టివేట్ చేసింది. వినియోగదారులకు అందే డొమెస్టిక్ ఎల్పీజీ సరఫరా కూడా ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగుతోంది. ఈ నెల 11వ తేదీ ఒక్కరోజే దేశవ్యాప్తంగా 52 లక్షల సిలిండర్లు డెలివరీ అయినట్లు సమాచారం.గ్యాస్ సరఫరాను క్రమబద్ధీకరించడం ద్వారా సామాన్యులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది.