Sunday, 19 April 2026
SWASTHIK NEWS
Home / రాజకీయం

తమిళనాడులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం: ఎన్డీయే అభ్యర్థుల గెలుపే లక్ష్యం!

19 Apr 2026
01:07 PM
75

స్వస్తిక్ న్యూస్, రాజకీయం :- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో NDA (నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్) అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఆయన అక్కడ ప్రచారం నిర్వహించనున్నారు.

​పర్యటన వివరాలు:- చంద్రబాబు నాయుడు ఈ నెల 20, 21 తేదీల్లో తమిళనాడులో పర్యటిస్తారు. ప్రధానంగా తెలుగు ప్రజలు అధికంగా నివసించే ప్రాంతాలపై ఆయన దృష్టి సారించారు.ప్రచార ప్రాంతాలు కోయంబత్తూరు, హోసూరు, చెన్నై, మరియు ఆవడి.కార్యక్రమాలు పర్యటనలో భాగంగా ఆయన బహిరంగ సభల్లో ప్రసంగించడంతో పాటు, భారీ రోడ్ షోలలో కూడా పాల్గొంటారు.తమిళనాడులో ఈ నెల ఏప్రిల్ 23న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, చంద్రబాబు పర్యటన అక్కడి రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లోని తెలుగు ఓటర్లను ప్రభావితం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించనున్నారు.

Swasthik News

Share this Article

Chenna

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!

Related Articles

Recent Updates