స్వస్తిక్ న్యూస్, తెలంగాణ:- ఈ ఏడాది మిర్చి సాగు చేసిన రైతులకు అదృష్టం వరించింది. మార్కెట్‌లో అన్ని రకాల మిర్చి ధరలు భారీగా పెరగడంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అంతర్జాతీయంగా డిమాండ్ పెరగడం ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
మార్కెట్ ధరల వివరాలు:- తాజాగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో నమోదైన ధరలు ఈ విధంగా ఉన్నాయి:తేజా మిర్చి (సాధారణ రకం): క్వింటాకు రూ. 21,000 పలికింది.ఏసీ మిర్చి క్వింటాకు రూ. 21,580 ధర లభించింది.టమాటా & ఎల్లో మిర్చి ఈ రకం మిర్చి ధరలు ఏకంగా రూ. 40,000 నుండి రూ. 50,000 వరకు పలికినట్లు సమాచారం.
పెరుగుదలకు కారణాలు:- చైనా వంటి దేశాల నుండి ఆర్డర్లు భారీగా పెరగడంతో మార్కెట్‌లో మిర్చికి విపరీతమైన డిమాండ్ ఏర్పడిందని వ్యాపారులు విశ్లేషిస్తున్నారు. ఈ ఏడాది దిగుబడితో పాటు ధర కూడా ఆశాజనకంగా ఉండటంతో మిర్చి రైతుల ఇంట సిరుల పంట పండుతోంది.