Sunday, 19 April 2026
SWASTHIK NEWS
Home / సినిమా

సింగర్ మంగ్లీపై కేసు నమోదు: ₹10 కోట్ల మోసం ఆరోపణలు

11 Apr 2026
10:32 AM
171

స్వస్తిక్ న్యూస్, సినిమా:-

హైదరాబాద్:- ప్రముఖ జానపద గాయని మంగ్లీ (సత్యవతి) చిక్కుల్లో పడ్డారు. ఆమెతో పాటు ఆమె సోదరుడు మరియు మరికొందరిపై హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

ప్రధానాంశాలు:-​మోసం ఆరోపణ: పెట్టుబడుల పేరుతో, అధిక లాభాలు ఇస్తామని నమ్మించి దాదాపు 100 మంది బాధితుల నుండి సుమారు ₹10 కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. న్యాయం చేయాలని బాధితులు లాయర్ సుబ్బారావును ఆశ్రయించారు. అయితే, మంగ్లీ బృందం ఆ లాయర్‌ను బెదిరించినట్లు సమాచారం.

కేసు వివరాలు:- లాయర్ ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. మంగ్లీతో పాటు ఆమె సోదరుడు శివ, డైరెక్టర్ వేణు ఉడుగుల మరియు ఇతరులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి బాధితులు లాయర్ ద్వారా న్యాయపోరాటానికి సిద్ధమవ్వగా, ఎదురుదాడికి దిగి బెదిరింపులకు పాల్పడటంతో విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. ప్రస్తుతం ఈ వ్యవహారం టాలీవుడ్ మరియు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Swasthik News

Share this Article

Chenna

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!

Related Articles

Recent Updates