స్వస్తిక్ న్యూస్, జాతీయం :- సమ్మర్ సీజన్‌లో చికెన్ తినడం ఆరోగ్యానికి మంచిదా కాదా అనే విషయంపై వైద్యులు పలు సూచనలు చేస్తున్నారు. చికెన్ ను వేసవిలో మితంగా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చికెన్ తినడం వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్లు లభిస్తాయని, అయితే వేసవిలో అధిక మసాలాలు, వేయించిన పదార్థాల రూపంలో తీసుకుంటే జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా తలనొప్పి, కడుపు మంటలు, కండరాల నొప్పులు, విరేచనాలు వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. అందువల్ల చికెన్‌ను తక్కువ మసాలాలతో, బాగా వండిన రూపంలో తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. అలాగే చికెన్ తిన్న వెంటనే చల్లని పదార్థాలు తీసుకోవడం మంచిది కాదని, కనీసం ఒక గంట విరామం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.అలాగే వేసవిలో చికెన్ వండేటప్పుడు పరిశుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని, ఫ్రిజ్‌లో ఎక్కువ రోజులు నిల్వ చేసిన చికెన్ వాడకూడదని చెబుతున్నారు. తాజా చికెన్ మాత్రమే వాడాలని, శరీరానికి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.