స్వస్తిక్ న్యూస్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్‌లో సీఎం చంద్రబాబు దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా RTC బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం కల్పించనున్నారు. అలాగే, వారితో వెళ్లే సహాయకులకు టికెట్‌పై 50 శాతం సబ్సిడీ అందించనుంది. ఈ నిర్ణయం ద్వారా దివ్యాంగులకు ప్రయాణంలో సౌలభ్యం కలగడంతో పాటు ఆర్థిక భారం కూడా తగ్గనుంది.

పథకం ప్రారంభం సందర్భంగా మంగళగిరి నుంచి వెనుమాక వరకు దివ్యాంగులతో కలిసి సీఎం చంద్రబాబు, Dy.CM పవన్, మంత్రి లోకేష్ బస్సులో ప్రయాణించారు. ఈ పథకం అమలు ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 11 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుందని అధికారులు తెలిపారు.