Monday, 23 March 2026
SWASTHIK NEWS
Home / ఆంధ్రప్రదేశ్

బ్రేకింగ్ న్యూస్.. 400 రూపాయలకు ఎగబాకిన చికెన్ ధరలు!

21 Mar 2026
08:35 AM
158

స్వస్తిక్ న్యూస్, ఆంధ్రప్రదేశ్ :- దేశవ్యాప్తంగా చికెన్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు అమాంతం ఎగబాకాయి. నిన్నటి వరకు కిలో చికెన్ ధర రూ.330 వరకూ ఉండగా, తాజాగా అది రూ.400కు చేరింది. దీంతో సాధారణ ప్రజలపై భారం పెరిగిందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.విజయవాడలో ప్రస్తుతం చికెన్ ధర రూ.380–400 మధ్య ఉండగా, హైదరాబాద్‌లో రూ.340–350 మధ్య విక్రయిస్తున్నారు. ఎండ తీవ్రతకు తగ్గట్టు ఉత్పత్తి తగ్గడం, సరఫరాలో అంతరాయం కలగడం వంటి కారణాల వల్ల ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. దీంతో రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!

Related Articles

Recent Updates