Monday, 23 March 2026
SWASTHIK NEWS
Home / ఆంధ్రప్రదేశ్

బ్రేకింగ్ న్యూస్.. 10వ తరగతి ఇంగ్లీష్ పరీక్ష వాయిదా

20 Mar 2026
08:07 AM
269

స్వస్తిక్ న్యూస్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ఇంగ్లిష్ (3rd లాంగ్వేజ్) పరీక్ష వాయిదా పడింది. రంజాన్ పండుగ నేపథ్యంలో ఈ నెల 21న నిర్వహించాల్సిన పరీక్షను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇంగ్లిష్ పరీక్షను తిరిగి ఏప్రిల్ 2న ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ మార్పుపై జిల్లా విద్యాశాఖాధికారులకు (DEOలకు) ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మిగతా పరీక్షల షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు లేవని, ఇంటర్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ పరీక్షలు ఈ నెల 21 నుంచి 25 వరకు యథావిధిగా కొనసాగనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

 

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!

Related Articles

Recent Updates