స్వస్తిక్ న్యూస్, రాజకీయం:-
అమరావతి:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలనను మరింత వేగవంతం చేసి, ప్రజలకు 'స్మార్ట్ గవర్నెన్స్' అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్ర క్యాబినెట్‌కు చెందిన 9 మంది మంత్రులు, పలువురు ఉన్నతాధికారులు సింగపూర్‌లో పర్యటించనున్నారు.
శిక్షణా కార్యక్రమం వివరాలు:- అధునాతన పాలనా పద్ధతులు, సాంకేతికత వినియోగంపై అవగాహన పెంచుకోవడానికి ఈ శిక్షణా తరగతులు ఏర్పాటు చేయబడ్డాయి.తేదీలు: ఈ నెల 21 నుండి 27 వరకు (వారం రోజుల పాటు).
ముఖ్య ఉద్దేశ్యం:- ప్రతిరోజూ ఒక ప్రత్యేక అంశంపై శిక్షణ ఉంటుంది. సింగపూర్‌లో అమలవుతున్న ఉత్తమ పాలనా విధానాలను అధ్యయనం చేయడం దీని ప్రధాన లక్ష్యం.ఈ బృందంలో నారాయణ, అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, అనిత మరియు జనార్దన్ ఉన్నారు.
ముఖ్య గమనిక:- సింగపూర్‌లో శిక్షణ పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన తర్వాత, ఈ మంత్రులు ఇతర ప్రజాప్రతినిధులకు తమ అనుభవాలను పంచుకుంటూ, రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ గవర్నెన్స్‌పై అవగాహన కల్పిస్తారు.