స్వస్తిక్ న్యూస్, సినిమా :- సినీ ఇండస్ట్రీ ప్రోత్సాహంలో తెలంగాణ ప్రభుత్వం ముందంజలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొంత వెనుకబడి ఉందని ప్రముఖ నటుడు చిరంజీవి అభిప్రాయపడ్డారు. తాజాగా జరిగిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సినీ రంగానికి అవసరమైన మద్దతు, ప్రోత్సాహం అందించడంలో తెలంగాణ ప్రభుత్వం ముందుంటుందని పేర్కొన్నారు.అలాగే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఈ విషయంలో కొరనున్నట్లు తెలిపారు. గతంలో అవార్డ్స్ కార్యక్రమంలో ఎన్టీఆర్ జాతీయ అవార్డు అందుకున్న సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు. సినిమా రంగానికి మరింత ప్రోత్సాహం లభిస్తే, పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఇండస్ట్రీ ఎప్పటికీ హైదరాబాద్‌కే గురుత్వాకర్షణగా ఉంటుందని, అయినా ఎలాగైనా రాష్ట్రానికి సహకరిస్తామని చిరంజీవి స్పష్టం చేశారు. దీంతో చిరంజీవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సినిమా విషయంలో కొన్ని సూచనలు చేశారు. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏపీలో సినిమా ఇండస్ట్రీకి బాటలు వేస్తాము అని తెలిపిన విషయం తెలిసిందే.