Tuesday, 21 July 2026
SWASTHIK NEWS
Home / తెలంగాణ

తరగని మధుర జ్ఞాపకం ఈ ప్రజాజీవితం: రేవంత్ రెడ్డి

04 Jul 2026
11:01 AM
5,043

స్వస్తిక్ న్యూస్, తెలంగాణ :-  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావోద్వేగ ట్వీట్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ZPTC స్థాయి నుంచి ముఖ్యమంత్రి (CM) స్థాయికి ఎదిగిన తన రెండు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణాన్ని నెమరువేసుకుంటూ ఆయన ఎక్స్ (X - గతంలో ట్విట్టర్) లో ఒక భావోద్వేగభరితమైన పోస్ట్ చేశారు.‘లక్షల అక్షరాలతో రాసినా.. కోట్ల పదాలను కూర్చి చెప్పినా.. తరగని మధుర జ్ఞాపకం.. ఈ రెండు దశాబ్దాల ప్రజాజీవితం’ అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Article Image

 తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో మలుపులు, సవాళ్లు ఉన్నాయని, వాటన్నింటినీ అధిగమించి ఈ స్థాయికి చేరుకోవడం ఎంతో తృప్తినిచ్చిందని ఆయన అన్నారు.నాడు ‘మిడిల్ లో రేవంత్ రెడ్డి’గా మొదలైన తన ప్రయాణం, నేడు తెలంగాణ ప్రజల ఆదరాభిమానాలతో 'రేవంతన్న'గా నిలిచే వరకు సాగిన అద్భుత ప్రయాణం తన జీవితంలో ఒక ప్రత్యేక అధ్యాయమని ఆయన అభివర్ణించారు.

Article Image

ప్రజలు తనపై ఉంచిన నమ్మకం, బాధ్యత తనను నిరంతరం నడిపిస్తున్నాయని తెలిపారు.ఇదే స్ఫూర్తితో ముందుకెళ్తానని, భవిష్యత్తులో ప్రజలకు మరింత సేవ చేస్తానని, వారి ఆకాంక్షలను నెరవేర్చేందుకు అహర్నిశలు శ్రమిస్తానని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా తన రాజకీయ ప్రయాణంలోని వివిధ దశలకు సంబంధించిన కొన్ని పాత ఫోటోలను కూడా ఆయన తన ట్వీట్‌తో పాటు షేర్ చేశారు.

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!

Related Articles

Recent Updates