స్వస్తిక్ న్యూస్ , పుల్లలచెరువు :- సోమవారం రాత్రి పుల్లలచెరువు మండలంలోని మల్లపాలెం గ్రామంలో శ్రీ శనగా సుబ్బారెడ్డి స్వామి తిరునాళ్ల మహోత్సవం వేడుకగా నిర్వహించారు. ఈ సందర్బంగా టీడీపీ ఆధ్వర్యంలో ఎలక్ట్రికల్ ప్రభను ఏర్పాటు చేసి, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయగా, పరిసర గ్రామ ప్రజలు, పాల్గొన్నారు. ఈ సందర్బంగా టీడీపీ ఇంచార్జి ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ కూటమి పరిపాలనలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయన్నారు. త్వరలోనే వెలుగొండను పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. టీడీపీ కన్వీనర్ గోవింద్, నాయకులు శనగా. నారాయణ రెడ్డి, గజ్వల్లి. భాస్కర్, స్థానిక నేతలు, తదితరులు పాల్గొన్నారు.
