Monday, 23 March 2026
SWASTHIK NEWS
Home / క్రీడలు

SRH కెప్టెన్ గా అభిషేక్ శర్మ.. ఫ్రాంచైజీ సంచలన నిర్ణయం?

16 Mar 2026
08:12 PM
95

స్వస్తిక్ న్యూస్,క్రీడలు :- ఐపీఎల్‌లో Sunrisers Hyderabad జట్టుకు కొత్త కెప్టెన్ ఎంపికపై ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. ఆ జట్టు కెప్టెన్ పాట్ కమ్మిన్స్ కు గాయం కారణంగా ఆరంభంలోని కొన్ని మ్యాచ్లకు దూరం అవడంతో ఇప్పుడు నూతన కెప్టెన్ పై చర్చలు జరుగుతున్నాయి. ఇటీవల జట్టులో యువ ఆటగాళ్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న ఫ్రాంచైజీ, ఈసారి నాయకత్వ బాధ్యతలను కూడా యువ క్రికెటర్‌కు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా భారత యువ ఆటగాడు అభిషేక్ శర్మ పేరును జట్టు యాజమాన్యం పరిశీలిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Article Image

ఎడమచేతి బ్యాట్స్‌మన్ అయిన అభిషేక్ శర్మ గత సీజన్‌లో తన దూకుడు బ్యాటింగ్‌తో అభిమానులను ఆకట్టుకున్నాడు. ఓపెనర్‌గా జట్టుకు మంచి ఆరంభాలు అందించడంతో పాటు కీలక మ్యాచ్‌ల్లో కీలక పాత్ర పోషించాడు. యువ ఆటగాళ్లతో జట్టును ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ అతనిపై నమ్మకం ఉంచుతున్నట్టు క్రీడా వర్గాలు చెబుతున్నాయి.

Article Image

అయితే అధికారికంగా ఈ విషయంపై ఫ్రాంచైజీ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. గతంలో కెప్టెన్‌గా ఉన్న ఆటగాళ్ల ప్రదర్శనను కూడా పరిశీలిస్తూ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వచ్చే ఇండియన్ ప్రీమియర్ లీగ్  సీజన్‌కు ముందు జట్టు కెప్టెన్‌పై స్పష్టత వచ్చే అవకాశముందని తెలుస్తోంది. అభిమానులు మాత్రం అభిషేక్ శర్మ కెప్టెన్ అయితే జట్టుకు కొత్త ఉత్సాహం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

 

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!

Related Articles

Recent Updates